ఆంధ్రాయూనివర్సిటీ అలూమ్ని సదస్సు 11న
ఆంధ్రాయూనివర్సిటీ అలూమ్ని అసోసియేషన్ (ఎఎఎ) ఆధ్వర్యంలో డిసెంబర్ 11వ తేదీన ఆంధ్రా యూనివర్సిటీ అలూమ్ని వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వర్చువల్‌గా జరిగే ఈ మీటింగ్ ఉదయం 9.30 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్, ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొంటున్నారు. జిఎంఆర్ గ్రూపు చైర్మన్, ఎఎఎ ఫౌండర్ చైర్మన్ డా. జిఎం రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. గెస్ట్ ఆఫ్ హానర్‌గా హైదరాబాద్‌లోని సిసిఎంబి డైరెక్టర్ డా. వినయ్‌కుమార్ నందికూరి, ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి, మాజీ వైస్ ఛాన్సలర్, ఎఎఎ చైర్మన్ ప్రొఫెసర్ బీల సత్యనారాయణ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో అలూమ్ని సభ్యులు, కార్యవర్గ సభ్యులంతా పాల్గొంటున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.













