వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. జూలై నుంచి విశాఖ నుంచే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రుల వద్ద వ్యాఖ్యానించారు. దీంతో అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. విశాఖ పాలనా రాజధాని అని గతంలో సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. తాను విశాఖకు షిప్ట్ అవుతానని ఢిల్లీలో ఆయన ప్రకటించారు కూడా. దీంతో ఎప్పటి నుంచి విశాఖ పాలన కొనసాగిస్తారనే ఆసక్తి నెలకొంది. నేడు జరిగిన కేబినెట్ భేటీ సీఎం జగన్ విశాఖ నుంచి పాలనపై మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జూలైలో విశాఖకు వెళ్తామని సీఎం జగన్ వాళ్లతో స్పష్టం చేశారు.













