ఏపీ మందు బాబులకు జగన్ గుడ్ న్యూస్ చెప్తారా…?
ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం అనేది ఎంతవరకు సాధ్యం ఏంటి అనేది పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్ని మాత్రం వివాదాస్పదంగా మారాయి. రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిన సరే ఎందుకు అనుకున్న విధంగా పరిస్థితులు కనపడ లేదు అని చెప్పాలి. రాజకీయంగా ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో విమర్శలు రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా వినబడుతున్నాయి. ముఖ్యంగా మద్యం ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో చాలా మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో మద్యపానం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కూలీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి రోజంతా పనిచేసి సాయంత్ర సమయంలో వచ్చి కచ్చితంగా మద్యం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయని వైద్యులు చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి మద్యం ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి ఉన్నా సరే ఎక్కడ కూడా వెనక్కు తగ్గే ప్రయత్నం చేయలేదు. దీని కారణంగా ప్రజలు ఆర్థికంగా ఎక్కువగా నష్టపోతున్నారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏమాత్రం కూడా మద్యం విషయంలో తగ్గలేదు అని ప్రకటించారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి సంబంధం లేకుండా మద్యపాన నిషేధం అమలు చ్చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా కనబడలేదు. దీంతో ఇప్పుడు విపక్షాలు కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేద్దాం అని భావించిన సరే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఎక్కువగా రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది.
పోలీసులు ఎన్ని విధాలుగా చర్యలు చేపడుతున్న సరే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రం నుంచి భారీగా ఆంధ్రప్రదేశ్ కు మద్యం వస్తుంది. దీంతో పోలీసులు కూడా దాదాపుగా చేతులెత్తేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. రాష్ట్రంలో నాణ్యమైన మధ్య దొరకకపోవడంతో చాలామంది పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకుంటున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసిపి కార్యకర్తలు కొంతమంది మద్యం అడిగితే నాయకులు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించారు అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించే ఆలోచనలో ఉందని సమాచారం. ఒకపక్క తెలంగాణలో మద్యంపై ఆదాయం పెరగటం వచ్చేది వేసవికాలం కావడం మద్యం వినియోగం ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జాగ్రత్త పడుతోంది. అందుకే రాష్ట్రంలో మద్యపానం నిషేధం ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి త్వరలోనే పాత బ్రాండ్లను మళ్లీ ప్రవేశపెట్టడమే కాకుండా మద్యం ధరలు భారీగా తగ్గించే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉందని సమాచారం. ఇక సంక్షేమ కార్యక్రమాలకు కూడా భారీగా నిధులు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మద్యం ధరలు తగ్గించి విక్రయాలు పెరిగితే ఆదాయం బాగుంటుంది. అందుకే ఏపీ సర్కార్ ఈ విషయంలో త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.













