Yoga : గిరిజన విద్యార్థులు చరిత్ర సృష్టించారు : మంత్రి లోకేశ్
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో యోగా (Yoga) కార్యక్రమంగా ఘనంగా నిర్వహించారు. గిన్నిస్ రికార్డు (Guinness Record ) సృష్టించేలా 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేసిన 25వేల మంది గిరిజన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క పిలుపుతో ప్రపంచం మొత్తం మనవైపు చూసే విధంగా చేసినందుకు అల్లూరి జిల్లా (Alluri District) విద్యార్థులకు ప్రభుత్వం తరపున దన్యవాదాలు. ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం విశాఖవైపు చూసిన రోజు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారు. 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం గిన్నిస్ రికార్డుగా శనివారం ప్రకటిస్తారు. విద్యార్థులందరికీ ప్రధానమంత్రి మోదీ (Prime Minister Modi) , సీఎం చంద్రబాబు (CM Chandrababu) తరపున అభినందనలు. యోగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈసారి విశాఖపట్నంలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరాం. రేపు 5 లక్షల మంది యోగాంధ్రలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించబోతున్నాం అని అన్నారు.













