జలవనరుల శాఖ నైపుణ్యాభివృద్ధి విభాగానికి గ్లోబల్ ప్లాటినమ్ అవార్డు-2019
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ జల వనరుల అభివృద్ది విభాగానికి ప్రపంచ మానవ వనరుల నైపున్యాభివృద్ధి పురస్కారం దక్కింది. ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో భూగర్భ జలవనరుల విభాగ జాయింట్ డైరెక్టర్, నీటి పారుదలశాఖ మంత్రి ఓఎస్డీ వరప్రసాదరావు, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ అవార్డులు అందుకున్నారు. ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ గ్లోబల్ హెచ్ఆర్ స్కిల్ డెవలప్మెంట్ 2019 కేటగిరీ లో ఈ పురస్కాన్ని అందించింది.













