16 బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో 16 బిల్లులను ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగుల విలీనం) బిల్లు, ఏపీ మిలెట్స్ బోర్డు బిల్లు, ఏపీ పప్పు ధాన్యాల బిల్లు, ఏపీ సహకార సంఘాల (రెండో సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లా (సవరణ) బిల్లు, ఏపీ విశ్వ విద్యాలయాల చట్టాల (సవరణ)బిల్లు ఏపీ విశ్వ విద్యాలయాల చట్టం (రెండో సవరణ)బిల్లు, జవహర్లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వ విద్యాలయం (సవరణ) బిల్లు, ఏపీ విద్యాచట్టం (సవరణ)-1982 బిల్లు, క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు బిల్లు-2019 ఉన్నాయి. వీటితో పాటు ఏపీ ఎస్సీ కమిషన్ బిల్లు, ఏపీ ఎస్టీ కమిషన్ బిల్లు, ఏపీ వృత్తులు, వర్తకులు, ఉద్యోగులపై పన్ను సవరణ బిలుల, ఏపీ ఎక్సైజ్ (రెండో సవరణ) బిల్లు, ఏపీ ప్రొహిబిషన్ (సవరణ) బిల్లు, ఏపీ సరుకులు, సేవలపై పన్ను (సవరణ) బిల్లు-2019 సభ ఆమోదం పొందాయి.













