16 నుంచి ఏపీలో పాఠశాలలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి పాఠశాలలు పున ప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నారు. 95 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని తెలిపారు. మిగిలిన వారికి కూడా త్వరితగతిన టీకాలు వేయాలని ఆదేశించామని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించామని తెలిపారు. ఆన్లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నడపొద్దని ఆదేశించామన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఆఫ్లైన్ లోనే పూర్తి స్థాయిలో పాఠశాలలను నిర్వహిస్తామన్నారు.













