ఏపీలో ముగిసిన తొలిదశ పంచాయతీ పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 జిల్లాల్లోని 2,723 పంచాయతీలు, 20,157 వార్డు స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో జరిగిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటువేసే అవకాశం కల్పించారు. తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక చేపట్టనున్నారు. తొలి దశలో పోలింగ్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.













