నేను రాజీనామా చేయలేదు… సుచరిత
తాను రాజీనామా చేయలేదని, అవన్నీ అవాస్తవాలేనని మాజీ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సుచరిత భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను పంపింది ఒక లేక అయితే, రాజీనామా లేఖ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ప్రత్యర్థులపై మండిపడ్డారు. పార్టీలో తనకు అవమానం జరగలేదన్నారు. జడ్పీటీసీ స్థాయి నుంచి హోంమంత్రి వరకు తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారని తెలిపారు. కేబినెట్లో కొంతమందిని మారుస్తానని సీఎం ముందే చెప్పారని అన్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యల వల్లే ఇంటి నుంచి బయటకు రాలేకపోయానని తెలిపారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వైఎస్ జగన్ కుటుంబంలో మనిషిగా తనను ఎప్పుడూ ఆదరిస్తారని, రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ ఎవంటే ఉంటానని స్పష్టం చేశారు.













