పవన్ కల్యాణ్ కు మహిళ కమిషన్ నోటీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు కనిపించకుండా పోతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ స్పందించింది. పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఏ కేంద్ర నిఘా వ్యవస్థ చెప్పిందో సమాచారం ఇవ్వాలని కోరింది. పవన్ చెబుతున్నట్లుగా తప్పిపోయిన మహిళల వివరాలను ఇవ్వాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. వివరాలు తెలిపిన కేంద్ర అధికారి ఎవరో చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది.













