మూడు రాజధానులపై పిటిషన్ లపై హైకోర్టులో విచారణ
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో విచారణ జరిగింది. మూడు రాజధానుల బిల్లులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వెనక్కి తీసుకున్న బిల్లులపై విచారణ జరపాలా? వద్దా? దానిపై విచారణ చేపట్టింది. హైకోర్టులో పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై విచారణ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తుది తీర్పు ఇవ్వకపోతే మళ్లీ బిల్లులు పెడుతుందని న్యాయవాదులు వాదించారు. రాజధానిలో కనీసం అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. అమరావతి కార్పొరేషన్ పేరిట గ్రామ సభలు జరపాలని న్యాయవాదులు కోరారు. తదుపరి విచారణను వచ్చే నెల 2కి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. పిటీషనర్ల తరపున శ్యామ్ దివాన్, రమేష్, జంద్యాల రవిశంకర్, వాసిరెడ్డి ప్రభునాథ్, అంబటి సుధాకర్ రావు, ఉన్నం మురళీదర్, కె.ఎస్.మూర్తి, సత్య ప్రసాద్, ప్రసాద్ బాబు, కేఎస్ మూర్తి, ఇంద్రనీల్ తదితరులు వాదించారు.













