యూట్యూబ్‌కు ఏపీ హైకోర్టు ఆదేశాలు.. అలాంటివన్నీ వెంటనే
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యూట్యూబ్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అసభ్య పోస్టుల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. పంచ్ ప్రభాకర్ కేసుపై న్యాయవాది అశ్వినీ కుమార్ ఉన్నత న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. కొత్త పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని నివేదించారు. ప్రైవేటు యూజర్ ఐడీల ద్వారా వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్లు కోర్టుకు వివరించారు. వీడియోలు అప్లోడ్ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. అలాంటివన్నీ వెంటనే తొలగించాలని యూట్యూబ్‌ను ఆదేశించింది.
పంచ్ ప్రభాకర్ అరెస్టుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ప్రభాకర్‌కు అమెరికా పౌరసత్వం ఉందని, అరెస్టు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలని సీబీఐ తెలిపింది. కేంద్రం అనుమతి కోసం దరఖాస్తు చేశామని పేర్కొంది. ఈ మేరకు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.













