ఏపీ రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్ లపై హైకోర్టులో విచారణ జరిగింది. సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు విపినించారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొందని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఈ పిటిషన్ లకు విచారణ అర్హత లేదని వాదించారు. ప్రభుత్వం కొత్త చట్టం చేయకుండా ఆపే హక్కు కోర్టుకు లేదన్నారు ఏజీ. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం చేసుకోలేమన్నారు. ఈ కేసు విచారణను ఈ నెల 4కు వాయిదా వేశారు.













