ఏపీ వైద్య ఆరోగ్యశాఖ సంచలన ఆదేశాలు.. ప్రతి రెండు గంటలకు ఒకసారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే డాక్టర్లకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రతీ రెండు గంటలకు ఒకసారి సెల్పీలు తీసి పంపాలని ఆదేశించారు. డ్యూటీలో ఉన్న సమయంలో రెండు గంటలకు ఒక్కసారి ఈ సెల్పీలను అప్లోడ్ చేయాలంటూ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడం, డ్యూటీ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఉండటం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.













