అమెరికా సంస్థతో ఏపీ విద్యాశాఖ ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు అమెరికా సంస్థతో మరో ఒప్పందం కుదుర్చుకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 12 లక్షల మంది విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొనేలా ఎడ్యుకేషన్ సబ్స్క్రిప్షన్ క్యాటలాగ్ పేరిట ఆ రాష్ట్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన ఈడీఎక్స్ ఎల్ఎల్సీ అనే సంస్థతో ఒప్పందం చేసుకొన్నది. ఈ మేరకు వివిధ కోర్సులు, సర్టిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా నామినేషన్ ప్రతిపాదికన ఈడీఎక్స్ సంస్థకు 6 మిలియన్ యూఎస్ డాలర్లు చెల్లించనున్నది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.













