Tirupati :తిరుపతి తొక్కిసలాట ఘటన.. న్యాయవిచారణకు ప్రభుత్వం ఆదేశం
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి (Satyanarayana Murthy )నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణ(Judicial inquiry ) కు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 8న తిరుపతి (Tirupati )లోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, పలువురు భక్తులు గాయపడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తీరుపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) న్యాయ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాజాగా జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













