5వ తేదీలోగా విధుల్లోకి రండి.. లేకుంటే చర్యలు తప్పవ్
వేతనాల పెంపు, గ్రాట్యుటీ సహా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత 22 రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సమస్యలు పరిష్కరించే వరకు నిరసన ఆపేది లేదని ప్రభుత్వానికి ఇప్పటికే అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసింది. జవనరి 5వ తేదీలోగా విధులకు హాజరు కావాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విజ్ఞప్తి పేరుతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చేయించింది. అంగన్వాడీల సమ్మె కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వారికి ఇప్పటికే పూర్తి చేసిన హామీలను వివరిస్తూ ప్రభుత్వం నోట్ జారీ చేసింది.













