ఏపీలో గూగుల్ కోడ్ ల్యాబ్?
దేశంలోనే తొలి గూగుల్ కోడ్ ల్యాబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది అంటూ గత ఏడాది ఒక వార్త వచ్చింది. దీనిపై, కొంత మంది యధావిధిగా ఎగతాళి చేసారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి వారైతే, నీ మొఖం, నీ కొడుకు మొఖం చూసి, రాష్ట్రానికి వస్తుందా అంటూ ఎగతాళి చేసారు. కట్ చేస్తే, గూగుల్ కోడ్ ల్యాబ్ మన రాష్ట్రంలో పెట్టటానికి, గూగుల్ కంపెనీ రెండు లక్ష డాలర్లు విడుదల చేసింది. గుంటూరు జిల్లాలోని పెదకాకాని వద్దనున్న వాసిరెడ్డి వెంకట్రాది ఇంజనీరింగ్ కళాశాలలో గూగుల్ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి గూగుల్ నుంచి చెక్ వచ్చినట్టు, వివిఐటి చైర్మన్ విద్యా సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి, గూగుల్ చేత, ఈ ల్యాబ్ ఇక్కడ పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఈ సెంటర్ నెలకొల్పటానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.













