ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదైంది. ఐర్లాండ్ నుంచచి ఈ నెల 5న రాష్ట్రానికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణయ్యిందని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొద్దాం పీహెచ్‌సీ పరిధి వీరనారాయణపురం గ్రామానికి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. జీనోమ్ సీక్వెన్సీ పరీక్షల అనంతరం ఒమిక్రాన్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యింది. ఐర్లాండ్ నుంచి ఆ వ్యక్తి గురించి మొదట ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇచ్చిన వెంటనే అవసరమైన వైద్య పరీక్షలు చేశారు. నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపి, ఆ వ్యక్తిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ నమూనాల పరిశీలించిన అనంతరం ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది.