ఓట్ల తొలగింపు కుట్ర లోగుట్టును ఛేదిస్తాం : ముఖ్యమంత్రి
టిడిపి సమాచారం చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందం. ఓట్ల తొలగింపు కుట్ర లోగుట్టును ఛేదిస్తాం. ఎలిబీ కోసమే ఢిల్లీవెళ్లి ఈసికి జగన్ ఫిర్యాదు. ఆ తరువాత నిస్సిగ్గుగా వైసిపి దొంగపనులు. టిఆర్ ఎస్ పార్టీకి డబ్బులు బాగా చేరాయి. అందుకే వైసిపికి కెసిఆర్ ఎదురు పెట్టుబడులు. టిడిపి అభ్యర్ధులను బెదిరించే బిజెపి నీచ కుట్రలు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రజలే బుద్ది చెబుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కెసిఆరే. వైసిపి, టిఆర్ ఎస్ కామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆరే. జగన్మోహన్ రెడ్డిని టిఆర్ ఎస్ కు డమ్మీగా చేశారు. ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషం కెసిఆర్ కుటుంబానికి ఆంధ్రాపై విద్వేషానికి టిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలే రుజువు. తెలుగుతల్లిని అవమానించిన కెసిఆర్ తో జగన్ దోస్తీ. ముందు కెసిఆర్ పెట్టుబడి పెడతారు. తరువాత జగన్ కప్పం కడతారు. వైసిపి, టిఆర్ ఎస్ కుట్రలను ప్రజలకు చెప్పాలి.













