ఏపీలో కర్ఫ్యూ పొడిగింపుకే ప్రభుత్వం మొగ్గు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం కర్ఫ్యూ పొడగింపుకే మళ్లీ మొగ్గు చూపింది. ప్రస్తుతం ఉన్న కర్ఫ్యూను కొనసాగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూను ఈ నెల 20 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే సడలింపు సమయాన్ని మాత్రం పెంచి, ప్రజలకు ఊరట కల్పించారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఉండేది. దీనిని కాస్తా 1 గంట వరకూ పొడిగిస్తూ తాజాగా సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూ గడువు ఈ నెల 20తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని అంచనా వేసిన తర్వాత కర్ఫ్యూ పొడిగింపుకే సీఎం జగన్, అధికారులు మొగ్గు చూపారు.