తిరుపతి రుయ తరహా ఘటనలు పునరావృతం కావొద్దు : జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై తిరుపతి రుయా తరహా ఘటనలు పునరావృతం కావొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రుయా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్ డ్రైవర్లు మాఫియాలా తయారై ఓ అభాగ్యుడితో అమానీయంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలన్నారు. ఆరోగ్య మిత్ర కియోస్క్‌ల వద్ద ఫిర్యాదు నంబర్లు కనిపించాలని చెప్పారు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా బాధితులు ఫిర్యాదు చేసేలా ఉండాలని సూచించారు. ఒకట్రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని అభిప్రాయపడ్డారు. విజయవాడ ఆస్పత్రిలో జరిగిన ఘటన లాంటిది మరోసారి జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలీసుల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అలసత్వం వహించారనే ఆరోపణలతో సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థంగా పనిచేయాలని సూచించారు.













