ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించిన.. సుప్రీం కోర్టు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది. సీబీఎస్‍ఈ పరీక్షల రద్దు అంశంపై విచారణ సందర్భంగా ఏపీ పరీక్షల రద్దు విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుశ్వంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా దవే మాట్లాడుతూ సుప్రీం విచారణ అనంతరం ముఖ్యమంత్రి వెంటనే పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణకు సిద్దమైనప్పటికీ మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేశామన్నారు. పది రోజుల్లో హైపవర్ కమిటీ అసెస్‍మెంట్ స్కీమ్‍ను రూపొందించి జూలై 31 లోపు ఫలితాలను ప్రకటిస్తుంది. దేశం మొత్తం ఒక వైపు ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక మార్గంలో వెళ్ళలనుకోవడం లేదని తాము భావించామని అన్నారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.