డిసెంబర్ 5న ఏపీ మంత్రి వర్గ విస్తరణ ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ డిసెంబర్ 5వ తేదీన జరగనుందని సమాచారం. ఈ మేరుకు ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఐదవ తేదీన రాష్ట్ర గవర్నర్ విజయవాడలో అందుబాటులో ఉంటున్నారా, లేదా అన్న విషయాన్ని సీఎంఓ కార్యాలయ అధికారులు ఆరా తీశారు. నూతన మంత్రుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాల్సిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయ అధికారులు గవర్నర్ కార్యాకలాపాలపై ఆరా తీసి ఉంటారని భావిస్తున్నారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా మంత్రివర్గ విస్తరణ విషయం చర్చనీయాంశంగా మారింది.













