ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ నిర్ణయాలు -2
• మూడు కేటగిరీల్లో 35 పోస్టుల ఏర్పాటుకు (13+17+5) జలవనరుల శాఖ ప్రతిపాదన. 1. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు డెప్యుటేషన్ 2) మార్కెట్ నుంచి నిపుణులను నిర్ణీత కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో తేవటం 3. JICA సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అండ్ లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు ఫేజ్ -2లో . కాంట్రాక్టు పద్ధతిలో సపోర్టింగ్ స్టాఫ్. నిపుణుల పోస్టుల పారితోషికం పెంచే ప్రతిపాదన. ప్రయాణ భత్యాల నిబంధనలకోసం గ్రేడ్ స్థిరీకరణ ప్రతిపాదనకు ఆమోదం.
• విజయనగరం జిల్లా పార్వతిపురంలోని హార్టీకల్చర్ కళాశాలలో రెండవ విద్యా సంవత్సరం కోసం 10 పోస్టులను మంజూరుచేస్తూ మంత్రిమండలి నిర్ణయం.
• రాజమండ్రిలో ఏర్పాటుచేసిన ఏసీబీ స్పెషల్ కోర్టుకు 5 పోస్టులను మంజూరుచేస్తూ మంత్రిమండలి నిర్ణయం. ఇందులో 2 లీగల్ అడ్వయిజర్ కమ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు, 2 జూనియర్ స్టెనో పోస్టులు, ఒక సబార్డినేట్ పోస్టు మంజూరయ్యాయి. ఏడాదికి రూ.39.73 లక్షల బడ్జెట్.
• కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు మంత్రుల పేషీల కోసం 16 పోస్టులను మంజూరుచేస్తూ మంత్రిమండలి నిర్ణయం. ఇద్దరు పీఎస్‌లు, నలుగురు పీఏలు, ఇద్దరు డ్రయివర్లు, ఇద్దరు జమేదార్లు, ఆరుగురు అటెండర్లు.. ఏడాదికి రూ.1.18.33,224 బడ్జెట్.
• 25మంది ఎమ్మెల్వోల జీతాలను పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం. వివిధ శాఖల మంత్రుల దగ్గర పనిచేస్తున్న 25 మంది మీడియా లైజనింగ్ ఆఫీసర్లకు ప్రస్తుతం రూ.20 వేలుగా ఉన్న జీతాన్ని 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనను ఆమోదించిన మంత్రిమండలి.
• గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఏర్పాటుచేస్తున్న జెఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాల కోసం ఉన్నత విద్యాశాఖలో 80 పోస్టులను మంజూరుచేస్తూ మంత్రిమండలి నిర్ణయం. ప్రొఫెసర్ పోస్టులు : 9, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు : 53, అసోసియేట్ ప్రోఫెసర్లు : 18. మొత్తం రూ.7.11 కోట్ల బడ్జెట్.
• ‘ఏపీ స్టేట్ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్’లో ఉన్న డిప్యూటీ డైరెక్టరు పోస్టును జాయింట్ డైరెక్టరుగా పదోన్నతి కల్పిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
• గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ‘రీసెర్చ్ కెమిస్టు’ సూపర్ న్యుమరరీ పోస్టుకు మంత్రిమండలి ఆమోదం.
• ప్రకాశం జిల్లా దర్శిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుతో పాటు 17 పోస్టులు మంజూరుచేస్తూ మంత్రిమండలి ఆమోదం.
‘పతంజలి’కి గడువు పెంపు :
• 452.9959 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వల్ని 30.04.2019 వరకు నిల్వ చేసుకునేందుకు పతంజలి ఆయుర్వేద సంస్థకు గడువు పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం. దీనికి గ్రౌండ్ రెంట్ వసూలుచేయాలని నిర్ణయించారు.
భారత్ నెట్ ఫేజ్ 2 :
• భారత్‌నెట్ ఫేజ్ 2 ప్రాజెక్టుకు మంత్రిమండలి ఆమోదం.
• మూడు ప్యాకేజీలుగా చేపట్టనున్న భారత్‌నెట్ ఫేజ్ 2.
స్ట్రెస్ ఎంటర్ప్రైజ్ పాలసీ:
• నష్టాల్లో ఉన్న ఎంఎస్ఎంఈ యూనిట్లకు ఉపశమనం కల్పించేందుకు స్ట్రెస్ ఎంటర్ప్రైజ్ పాలసీ-2018-2020కు మంత్రిమండలి ఆమోదం.
• నష్టాల్లో ఉన్న పరిశ్రమలకు అదనపు ఆర్థిక సాయం. ఉద్యోగుల జీతాల బకాయిలు చెల్లింపు, వడ్డీ బకాయిల చెల్లింపు, వడ్డీ సబ్సిడీ తదితరాల విషయంలో ఈ పాలసీ దోహదపడుతుంది.
ఏపీ విండ్, సోలార్, హైబ్రీడ్ పవర్ పాలసీ-2018 :
• ఆంధ్రప్రదేశ్ విండ్, సోలార్, హైబ్రీడ్ పవర్ పాలసీ-2018 తీసుకురావాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• రాష్ట్రంలో హైబ్రీడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఈ పాలసీ దోహదపడుతుంది. 2021-22 నాటికి 18 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా దీనిని తీసుకువస్తున్నారు. జాతీయ పునరుత్పాదక విద్యుత్ ఉత్పాదనలో 10% ఏపీ వాటా ఉండాలన్న లక్ష్యంతో దీన్ని రూపొందిస్తున్నారు.
• ఏపీ విండ్ పాలసీ-2015, ఏపీ సోలార్ పాలసీ-2015కు బదులుగా కొత్త పాలసీ:
• ఏపీ విండ్ పాలసీ-2015, ఏపీ సోలార్ పాలసీ-2015 స్థానంలో కొత్త సోలార్ పవర్, విండ్ పవర్ పాలసీలను ప్రవేశపెట్టాలని మంత్రిమండలి నిర్ణయం.
• విద్యుత్ భద్రత, క్లీన్ ఎనర్జీ లక్ష్యంగా ఈ పాలసీలను తీసుకొస్తున్నారు.
• వచ్చే ఐదేళ్లలో 5 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా పాలసీ. ఈ పాలసీ కిందనే సోలార్ పంపుసెట్లను అందిస్తారు.
ఇండస్ట్రీ ప్రోత్సాహకాలకు ఓకే :
• ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2015-20 పాలసీ కింద ఏర్పాటైన మెగా ప్రాజెక్టులు, ఇతర ముఖ్య ప్రాజెక్టులకు 26.9.2014 నుంచి 12.6.2018 మధ్య కాలానికి SIPB ఇచ్చిన ప్రోత్సాహకాల ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
అరవింద్ యూనిట్ :
• చిత్తూరుజిల్లా వాల్మికిపురం మండలం తాటిగుంటపల్లి గ్రామంలో జీన్స్ గార్మెంట్స్ అండ్ ఫ్యాబ్రిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు అరవింద్ లిమిటెడ్‌కు 130 ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం.
• రూ.760 కోట్లతో యూనిట్ ఏర్పాటు. 9,300 మందికి ఉద్యోగాలు. రెండు దశల్లో పరిశ్రమ ఏర్పాటు.
అనంతపురం జిల్లాలో పీహెచ్సీ :
• అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం దర్గా హొన్నూరులో పీహెచ్సీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం. రూ.1.91 కోట్లతో దీన్ని ఏర్పాటుచేస్తారు.













