సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ప్రకటించిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి అన్నారు. నిరుద్యోగ భృతి ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఓ వైపు ఉద్యోగాల కల్పన చేస్తూనే నిరుద్యోగులకు న్యాయం చేస్తోందని అన్నారు.













