ఏపీలో నిరుద్యోగ భృతి వెయ్యి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. డిగ్రీ, తత్సమాన విద్యార్హత కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు ఇది అందుతుంది. పేదలు, తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. సుమారు 10 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేసినా, ఎంతమంది అర్హులుంటే అంతమందికీ ఇవ్వాలని నిర్ణయించింది. ఒక కుటుంబానికి ఒక్కరికే నిరుద్యోగ భృతి అన్న పరిమితి లేదు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు అర్హులున్నా ఇవ్వాలని నిశ్చయించింది. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ ప్రాథమిక నిర్ణయాన్ని మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్ర మీడియాకు వెల్లడించారు.













