14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. అలాగే మరో రెండు నెలల్లో ఎన్నికలు ఏడాదిలోకి ప్రవేశించబోతోంది. ఎన్నికల ఏడాది పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉండదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారాయి. ఈ ప్రభుత్వానికీ ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు కానున్నాయి. 14వ తేదీన గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం తర్వాతా బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పని రోజులు నిర్ణయిస్తారు. కనీసం పది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకున్న ప్రభుత్వం వాటితో బడ్జెట్ పద్దు సిద్ధం చేస్తోంది.













