సంక్షేమమే ప్రధానం… సమగ్రాభివృద్ధి విధానం…
– రూ.2.24లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమది సంక్షేమ రాజ్యమని బడ్జెట్ ద్వారా మరోసారి తేల్చి చెప్పింది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో వరుసగా రెండో సారి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆసాంతం సంక్షేమ రాగం ఆలపించింది. బడ్జెట్లో ఆరోగ్యం కూడా తగిన ప్రాధాన్యత దక్కించుకుంది. బడ్జెట్ సందర్భంగా మాట్లాడిన బుగ్గన… ప్రస్తుత కరోనా మహమ్మారిపై పోరాటంలో తాము ముందు వరుసలో ఉన్నామని చెప్పారు. మరోవైపు లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. పేద ప్రజలను ఆర్థికసాయం ద్వారా పైకితీసుకు రావాలని, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చాలని సీఎం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి సవాళ్లుగా మారాయని అయినా పట్టుదలతో ముందుకెళుతున్నామన్నారు.
సంక్షేమ కేటాయింపులు… ఇలా
బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789.18 కోట్లు, రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు, వ్యవసాయానికి రూ.11,891 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా రూ.3,615 కోట్లు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు, విభిన్నవర్గాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు, విద్యకు రూ.22,604 కోట్లు, మైనార్టీల సక్షేమానికి రూ.1998 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు, కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు, వైద్య రంగానికి రూ.11,419 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.2,100 కోట్లు, వైఎస్ఆర్ గృహ వసతికి రూ.3వేల కోట్లు, పీఎం ఆవాస్ యోజన(అర్బన్) రూ.2,540 కోట్లు, పీఎం ఆవస్‌యోజన(గ్రామీణం) రూ.500 కోట్లు, బలహీన వర్గాల గృహనిర్మాణానికి రూ.150 కోట్లు, రేషన్ బియ్యానికి రూ.3వేల కోట్లు, డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు, 30లక్షల ఇళ్ల పట్టాలు రూ.8వేల కోట్లు, అభివృద్ధి పథకాలకు రూ.84,140.97 కోట్లు, షెడ్యూల్డుకులాల అభివృద్ధికి రూ.15,735.68 కోట్లు, షెడ్యూల్డు తెగలకు రూ.5,177.53 కోట్లు, బీసీల అభివృద్ధికి గతంలో పోలిస్తే 68.18శాతం అధికంగా రూ.25,331.30 కోట్లు. గతేడాదితో పోలిస్తే 116.10శాతం అధికంగా మైనార్టీల అభివృద్ధికి 2050.22 కోట్లు., జగనన్న చేదోడు పథకానికి 247 కోట్లు.
రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఇలా…
న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్కు రూ. 856.64 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు, ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు, విద్యుత్ రంగానికి రూ. 6,984.72 కోట్లు,ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు,సోషల్ వెల్ఫేర్ కోసం రూ.12,465.85 కోట్లు,ట్రాన్స్‌పోర్టు, ఆర్అండ్బీ కోసం రూ.6,588.58 కోట్లు, మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు, ఆరోగ్యశాఖకు రూ.11,419.44 కోట్లు కేటాయింపు
Click here Budget Speech Telugu













