ఏపీ అసెంబ్లీ సమావేశాలపై… రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాలకు సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. మార్చి 19 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశాల్లోనే 2021-2022 బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టనుంది. జెండర్ బడ్జెట్ను ప్రవేశపెడతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మరో వైపు ప్రజా సమస్యలపై అధికారపక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.













