దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా ..వాటి మూలాలు ఏపీలోనే : వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ కానీ ఇప్పుడు డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటి మూలాలు ఏపీలో ఉంటున్నాయన్నారు. డ్రగ్స్ రవాణా, వినియోగంలో ఏపీకి నంబర్ వన్ ముద్రవేశారు. విశాఖలో చిక్కిన డ్రగ్స్‌పై పరస్పరం నిందలు వేసుకుంటున్నారు. నిఘా వ్యవస్థకు తెలియకుండా రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా వస్తాయి? డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? ఈ కేసులో తెర వెనుక ఎంతటి పెద్ద వాళ్లు ఉన్నా, నిగ్గుతేల్చాలని సీబీఐని కోరుతున్నా. ఆసియాలోనే అతిపెద్ద డ్రగ్ డీల్‌గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు, పారదర్శక విచారణ కోసం సిటింగ్ జడ్జితో కమిటీ వేయాలని అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.













