సుధాకర్ డిశ్చార్జికి హైకోర్టు అనుమతి
డాక్టర్ సుధాకర్ తల్లి ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. సుధాకర్‌ను పోలీసులు, సీబీఐ అధికారులు అరెస్టు చేయలేదని, అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఆసుపత్రిలో బంధించారని సుధాకర్ తల్లి పిటిషన్లో పేర్కొన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న తర్వాత.. వైద్యుడు సుధాకర్ డిశ్చార్జికి ఉన్నత న్యాయస్థానం సమ్మతించింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని సృష్టం చేసింది. సీబీఐ విచారణకు సహకరించాలని సుధాకర్‌కు న్యాయస్థానం సూచించింది. గత నెల 16 నుండి డాక్టర్ సుధాకర్ విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.













