వైఎస్ వివేకా హత్య కేసు… ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హత్య జరిగి ఏడాది కావస్తున్నా కేసు దర్యాప్తులో పరోగతి లేదని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం కీలకం కాబట్టి సీబీఐకి అప్పగించినట్లు సృష్టం చేసింది. కేసులో అంతరాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందని, ఇతర రాష్ట్రాల నిందితులను పట్టుకునే శక్తి సామర్థ్యాలు సీబీఐకి ఉన్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పులివెందుల పీఎస్ నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సీఎం జగన్ పిటిషన్ ఉపసంహరణ ప్రభావం కేసుపై ఉండకూడదని సూచించింది. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.













