విరాళాల సేకరణకు కనెక్ట్ టు ఆంధ్రా!
సామాజిక బాధ్యత కింద దాతల నుంచి విరాళాలు సేకరించి అభివృద్ధి, సంక్షేమం కోసం కనెక్ట్ టు ఆంధ్రా పేరుతో సంస్థను నెలకొల్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం ప్రారంభించిన స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ పేరు మార్చి, కొత్త పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. ముఖ్యమంత్రి జగన్ చైర్మన్‌గా వ్యవహరించే కనెక్ట్ టు ఆంద్రా ఫౌండేషన్‌కు సలహా మండలిని కూడా నియమిస్తారు. ఈ కార్యక్రమం కింద రూ.వెయ్యి కోట్లు విరాళంగా స్వీకరించాలనేది లక్ష్యంగా చెబుతున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సామాజిక బాధ్యత కింద పలు కంపెనీలు రూ.62.59 కోట్లు ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చాయి.













