టీటీడి బోర్డ్ నుంచి అనిత ఔట్
అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఈ మధ్యే నియమితులైన ఎమ్మెల్యే వంగలపూడి అనితను ఆ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురు వారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ప్రభు త్వం టీటీడీ పాలక మండలిని పూర్తి స్థాయిలో నియమించిన సంగతి విది తమే. ఆ క్రమంలో ఆమెను బోర్డు మెంబర్గా నియమించారు. అయితే ఆమె హిందువు కాదని, క్రిస్టియన్ అని విమర్శలు రావడంతో పాటు అనితనే స్వయంగా తనను పదవి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ కూడా రాశారు. దీంతో ప్రభుత్వం విచారించి, ఆమె కోరిక మేరకు ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.













