ఏపీ రాజ్‌భవన్ కు సోకిన కరోనా
ఆంధప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. కరోనా అనుమానిత లక్షణాలు కొందరు సిబ్బందిలో కనిపించడంతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తోపాటు ఎనిమిది మందికి ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బందిలో నలుగురికి పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో హోం క్వారంటైన్‌కు తరలించారు. గవర్నర్, ఆయన సతీమణిని ప్రత్యేక వైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. తాజా పరిణామాల ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ భద్రత విధుల్లో ఉన్న మంగళగిరి బెటాలియన్‌కు చెందిన 82 మంది పోలీసులను మార్చి విజయనగరం బెటాలియన్ నుంచి కొత్త సిబ్బందిని రప్పించనున్నారు.













