పోలవరం నుంచి నవయుగ ఔట్
పోలవరం నిర్మాణ పనుల నుచి తప్పుకోవాలంటూ నవయుగ సంస్థకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఈపీపీ టెండరు ప్రక్రియాలోని క్లాజ్ 89 (3) ప్రకారం పోలవరం ప్రాజెక్టులోని హెడ్‌వర్క్స్ పనులు, క్రస్ట్ లెవెల్ వరకు స్పిల్‌వే నిర్మాణం, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్, జలవిద్యుత్ కేంద్రం ఫౌండేషన్‌తో పాటు అప్రోచ్ ఛానల్ తదితర పనుల నుంచి తప్పుకోవాలంటూ ప్రీక్లోజర్ నోటీసులు జారీ చేసింది. ఇంజినీరింగ్ ప్రాజెక్టులపై సిఫార్సుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 60 (సి) నిబంధన ప్రకారం పాత కాంట్రాక్టర్‌ను తప్పిస్తూ నామినేషన్ ప్రాతిపదికన పనులు కేటాయించడంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిఏన నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినందున ప్రీక్లోజర్ నోటీసులు జారీ చేసినట్లు జలవనరుల శాఖ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌బాబు పేరిట నవయుగ సంస్థకు ఈనోటీసులు జారీ అయ్యాయి.













