15న ఏపీ సీఎం అమెరికా పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీ రాత్రి కుటుంబ సమేతంగా అమెరికా వెళ్ళనున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అధికారికంగా ప్రకటన జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన హైదరాబాద్కు వెళ్తారు. అక్కడి నుండి రాత్రికి బయులుదేరి అమెరికా వెళ్లనున్నారు. అయితే, ముఖ్యమంత్రి చిన్న కుమార్తె అమెరికాలోని ఇండియానా స్టేట్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరనున్నారు. అందువల్ల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రయాణ ఖర్చులు, వసతి ఏర్పాట్లకు అయ్యే ఖర్చు ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా భరించనున్నారు. ఇదే సందర్భంలో అమెరికా ప్రభుత్వ అధికారులు, పెట్టుబడిదారులు, అమెరికాలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న ప్రవాసాంధ్రులతో వాషింగ్టన్ డీసీ, డల్లాస్లలో ఈ నెల 16 నుండి 18వ తేదీ వరకూ సమావేశం కానున్నారు. అలాగే 22వ తేదీన వివిధ రకాల పెట్టుబడిదారులతో చికాగాలో సమావేశం కానున్నారు. ఈ నెల 24వ తేదీ ఉదయానికి ఆయన తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.











































































