హైదరాబాద్ అభివృద్ధి నా కష్టార్జితం : చంద్రబాబు
హైదరాబాద్ అభివృద్ధి నా కష్టార్జితం. దాన్ని పాలించుకోవడం చేతకాక నన్ను విమర్శిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా మార్టూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను బంగారు గుడ్లు పెట్టే బాతులా తయారు చేసి ఆయనకు అప్పజెప్పాను. కాలికి బలపం కట్టుకుని ప్రపంచమంతా తిరిగి పెద్దపెద్ద సంస్థలను తీసుకొచ్చి ఆ నగరాన్ని అభివృద్ధి చేశాను. పాలించుకోవడం చేతకాక నాపై విమర్శలు చేసి తన చేతకానితనాన్ని ఆయన కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని విమర్శించారు.













