ఏపీ బిజెపీకి కొత్త కమిటీ…
ఆంధ్రప్రదేశ్ భాజాపాకు కొత్త పదాధికారుల కమిటీ ఏర్పాటైంది. మొత్తం 40 మందితో సోము వీర్రాజు టీమ్ రూపుదిద్దుకుంది. ఇందులో 5గురు ప్రధాన కార్యదర్శులు 10 మంది కార్యదర్శులు ఉన్నారు. అలాగే 10మంది ఉపాధ్యక్షులతో పాటు అరడజను మంది అధికార ప్రతినిధులు, ట్రెజరర్లతో ఈ కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. భాజాపా యువ మోర్చాలకు 7గురు కొత్త అధ్యక్షులను నియమించారు. కమిటీ కూర్పులో తనదైన ముద్ర వేశారు సోము వీర్రాజు. పార్టీకి విధేయులుగా ఉన్నవారికి పెద్ద పీట వేశారు. జంబో కమిటీల ఏర్పాటు సంప్రదాయానికి ఆయన స్వస్తి పలికారు.













