అనంతపురం టీడీపీ అభ్యర్థుల ఖరారు
అనంతపురం జిల్లా హిందుపురం, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి ప్రజావేదికలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా హిందూపురం సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పకు, అనంతపురం ఎంపీ టిక్కెట్ సిట్టింగ్ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డికి కేటాయించారు. అలాగే రాప్తాడు అసెంబ్లీ మంత్రి పరిటాల సునీతకు మడకశిర వీరన్నకు, పెనుగొండ పార్థసారథికి, పుట్టపర్తి పల్లె రఘునాధరెడ్డి లేదా గంగన్నకు, ధర్మవరం సూరికి, కదిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్‌భాషా, కందికుంట ప్రసాద్, హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు, రాయదుర్గం మంత్రి కాల్వ శ్రీనివాసులుకు, ఉరవకొండ ఎమ్మెల్సీ పార్టీ విప్ పయ్యావుల కేశవ్‌కు కల్యాణదుర్గంకు హనుమంతరాయ చౌదరి, రామ్మోహన్ చౌదరి, డిఎస్ మూర్తి, గుంతకల్‌కు జితేంద్రగౌడ్, వెంకట శివయాదవ్, మదుసూదనగుప్తా, తాడిపత్రికి సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి, అనంతపురం సిటికి ప్రభాకర్ చౌదరి, సింగనమల అసెంబ్లీకి శ్రావణిలకు కేటాయించారు. అయితే ఒక్కొక్క అసెంబ్లీ నియోజక వర్గంలో ఇద్దరు ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉండగా రేపోమాపో అభ్యర్థులను నిర్థారించనున్నారు.













