ముందు వాళ్లకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగు.. విజయ్ సాయి రెడ్డికి ఆనం సవాల్..
విజయ్ సాయి రెడ్డి ఎంట్రీ తో నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై రీసెంట్గా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఆనం వెంకటరమణారెడ్డి.. ఏం తెలుసని నువ్వు వేమిరెడ్డి గురించి మాట్లాడుతున్నావ్ విజయ్ సాయి రెడ్డి అంటూ ప్రశ్నించారు. కులమతాలకు అతీతంగా సేవ చేసిన వ్యక్తి వేమిరెడ్డి అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం బియ్యం వల్ల అనారోగ్యాల పాలై ఎంతోమంది చనిపోయారని.. దొంగ సారా కారణంగా ఎన్నో కుటుంబాలు అన్యాయం అయిపోయాయని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. విజయ్ సాయి రెడ్డి ముందుగా ఈ కుటుంబాల వారికి క్షమాపణలు చెప్పి ఆ తర్వాతే ఓట్లు అడగాలి అని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. విజయ సాయిరెడ్డి తన మాటల చాతుర్యంతో గెలవాలని ప్రయత్నిస్తున్నాడని.. అయితే ప్రజలకు నిజమేమిటో బాగా తెలుసని ఈ సందర్భంగా ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.













