వైసీపీలోకి ఆనం రామ్ నారాయణ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేతల చేరికలు పుంజుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణరెడ్డి లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి వచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆనం సమావేశమయ్యారు. ఇరువురి మధ్య తాజ పరిస్థితులు చర్చకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆనం ఈ సందర్భంగా జగన్ వద్ద లైన్ క్లియర్ చేసుకున్నారు. ఆషాడమాసం అనంతరం మంచి రోజు చూసి పార్టీలో చేరనున్నట్టు జగన్కు వివరించారు. జగన్ అందుకు అంగీకారం తెలిపారు. అయితే ఆనం తనతోపాటు తన కుటుంబానికి చెందిన ఒకరిద్దరికి పార్టీలో తగిన ప్రాధాన్యతతో పాటు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లను కేటాయించాలని కోరినట్లు సమాచారం. వెంకటగిరి నియోజకవర్గం సీటు కొరినట్టు తెలిసింది. పార్టీ అధిష్టానం అందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం.













