అనకాపల్లి కోర్టు సంచలన తీర్పు
మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు సహా 16 మందికి జీవితఖైదు విధిస్తూ అనకాపల్లి సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అలాగే మరో ఐదుగురికి రెండేళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. గత పది సంవత్సరాల క్రితం నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో బీఎంసీ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మత్స్యకారుడు గోసల కొండ మృతిచెందారు. అయితే మత్స్యకారుడి మృతికి నాటి ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, ఆయన అనుచరులే కారణమంటూ కోర్టులో కేసు దాఖలైంది. ఆ కేసుకు సంబంధించిన తీర్పు నేడు వెలువడింది. మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు సహా 16 మందికి జీవితఖైదు విధిస్తూ అనకాపల్లి సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అలాగే మరో ఐదుగురికి రెండేళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది.













