Satya Prasad: ఆయన పాపాలు వంద సార్లు తల నరుకున్నా పోవు : మంత్రి అనగాని

నాస్తికుడిని ఆస్తిపరుడిని చేయడానికే గత ప్రభుత్వంలో భూమన కరుణాకరరెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించారని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (Satya Prasad) ఆరోపించారు. కరుణాకరరెడ్డి (Karunakara Reddy) చూపు మొత్తం ఎప్పుడూ స్వామివారి ఆస్తులు కొట్టేయడంపైనే ఉంటుందని విమర్శించారు. 15 ఏళ్లుగా స్వామివారి సొమ్ము దోచేస్తున్న దొంగను లోక్‌అదాలత్ ఎలా సెటిల్మెంట్ చేశారని ప్రశ్నించారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ (Veerappan) అడవులు ఖాళీ చేసినట్లు కరుణాకర్‌రెడ్డి తిరుపతి (Tirupati) ప్రజల ఆస్తులు ఖాళీ చేశారని ఎద్దేవా చేశారు. చీమకు కూడా హాని చేయని పరమ సాత్వికుడిని తానేనంటూ కరుణాకరరెడ్డి తోడేలులా నటిస్తున్నారు. అమాయకపు ముఖంతో ఎంత నటించినా, చావు తెలివితేటలతో దొరికిపోతారు. తులసివనం లాంటి పవిత్రమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో గంజాయి మొక్క ఆయన. ఐదేళ్లుగా ఆలయ పవిత్రతను మంటగొల్పింది చాలక ఇప్పుడు నిత్యం విష ప్రచారాలతో దండయాత్ర చేస్తున్నారు. కరుణాకరెడ్డి చేసిన పాపాలు ఆయన వంద సార్లు తల నరుకున్నా పోవు అని అన్నారు.