Minister Satya Prasad: వచ్చే ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడిస్తారు : మంత్రి అనగాని

ప్రజా రాజధాని అమరావతిపై మళ్లీ వైసీపీ నేతలు దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (Satya Prasad) విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో మూడు ముక్కలాట ఆడిన జగన్ (Jagan) ను ప్రజలు చీదరించుకున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం అక్కర్లేదంటూనే గుంటూరు (Guntur) , విజయవాడ (Vijayawada) మధ్య నిర్మిస్తామని కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఇక్కడి రైతులు, మహిళలపై జగన్ వేధింపులు, పెట్టిన కేసులు ఇంకా మర్చిపోలేదన్నారు. ఆయన గోడ మీద పిల్లి వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. ఐదేళ్లపాటు అమరావతి (Amaravati) ని నిర్లక్ష్యం చేసిన జగన్‌ను వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజలు ఓడిస్తారని పేర్కొన్నారు.