గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అమరావతి
ఆర్థిక నగరాలను అభివృద్ధి చేస్తున్నాం. జక్కంపూడి సిటీని ఒక నమూనాగా తీసుకుని మొదలు పెట్టాం.
అమరావతి నగరాభివృద్ధి అనేకమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించింది.
ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాలలో అమరావతి ఒకటిగా నిలుస్తుంది.
గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అమరావతి.
3.5 మిలియన్ జనాభా, 2 మిలియన్ల మందికి ఉద్యోగాలు సృష్టించే నగరం అమరావతి.
తొలిదశలో రూ.51 వేల కోట్లు, రెండో దశలో మరో 50 వేల కోట్లు అమరావతి నగర నిర్మాణానికి అవసరం అవుతాయి.
ఎస్ఆర్ఎం, అమృత్, విట్ వంటి ప్రతిష్టాత్మక వర్శిటీలు వచ్చాయి. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తున్నాయి.
అమరావతి ఎడ్యుకేషన్, హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం.
8 స్టార్ హోటళ్లు వస్తున్నాయి.
80 వేల హోటల్ గదులు రాజధానికోసం అవసరం అవుతాయి.
2400 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రహదారులను అభివృద్ధి చేశాం
11 జాతీయ రహదారులను 715 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలి.
130 వంతెనలు కొత్తగా నిర్మాణంలో ఉన్నాయి.
ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర రహదారులను విస్తరిస్తున్నాం.
ప్రజల అవసరాల మేర రహదారుల అభివృద్ధి జరుగుతోంది.
కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి వినూత్న ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం.
రహదారులపై ఎక్కడా గుంతలు ఉండకుండా నిర్వహణ వ్యవస్థను ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పగిస్తున్నాం.
లాజిస్టిక్ యూనివర్శిటీని పెడుతున్నాం.
రోడ్ కార్గో, రైల్ కార్గో, ఫ్లయిట్, సీ కార్గోలతో కూడిన ప్రజా రవాణాను అభివృద్ధి చేయాలి.
వయాడక్ట్ విధానాన్ని తు.చ. తప్పకుండా అమలుచేస్తాం.
అమరావతిలో అందరికీ ఇళ్లు ఇస్తున్నాం. ప్రజారాజధాని పేరు పెట్టాం. 500 ఎకరాలు ఇళ్ల కోసం రిజర్వ్ చేసి పెట్టాం. ప్రజారవాణాను విద్యుత్ వాహనాలతో అందుబాటులో ఉండేలా చూస్తున్నాం.
తెలంగాణ వాడుకున్న విద్యుత్ వరకు బకాయిలు ఇవ్వాల్సిందే. అవసరమైతే న్యాయపరంగా పోరాడుతాం.
మీకు ఇబ్బందులు ఉంటే, మాకు కూడా ఇబ్బందులు వుంటాయి. బకాయిలు చెల్లించకపోతే ఎలా
అమరావతి నగరం కోసం మరికొన్ని గ్రామాలను భూ సమీకరణ విధానంలో తీసుకునే ప్రతిపాదనను అవసరాన్ని బట్టి చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
హైదరాబాద్, ఢిల్లీ, ముంబైల్లో వుండే నాన్ స్టేక్ హోల్డర్లే భూ సమీకరణకు అడ్డుపడుతున్నారు.
హామీలు ఎన్నో ఇచ్చారు. చట్టంలో చెప్పిందే చేయడం లేదు, ఇక ఇచ్చిన మాటలకు విలువ ఏముంది?
కేంద్రంపై మాకు వ్యతిరేకత కాదు, చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే అభ్యంతరం చెబుతున్నాం.
ఇక్కడ నా వెనుక ఉన్న ఈ పురస్కారాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే కదా.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మెచ్చుకుని ఇచ్చినవే కదా













