సీఎం వైఎస్ జగన్ కు అమిత్ షా షోన్
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. కోవిడ్ 19 నివారణ చర్యలపై సమీక్ష జరుగుతుండగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. లాక్డౌన్ పరిణామాలు, దీని తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపైన వారిద్దరూ చర్చించారు. కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అమిత్‌షాకు వివరించారు. రాష్ట్రంలో విస్త•తంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి మిలియన్ జనాభాకు 1,274 చొప్పున అత్యదిక పరీక్ష నిర్వహించామని తెలిపారు. కరోనా పరీక్షలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.













