తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. శ్రీవారి ఆలయం మహాద్వారం దగ్గర అమిత్ షా, జగన్ కి టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. శేష వస్త్రాలతో టీటీడీ అధికారులు వారిని సత్కరించారు. స్వామివారి చిత్రపటంతో పాటు టీటీడీ డైరీ క్యాలెండర్లను బహుకరించారు. అక్కడి నుండి విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు చెల్లించారు.













