వారి పయనం సీఎం చంద్రబాబు వెంటే
దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనన్ని పనులు టీడీపీ సర్కారు ఆర్యవైశ్యులకు చేసిందని, వారి పయనం సీఎం చంద్రబాబు వెంటేనని రాష్ట్ర టీవి, చలనచిత్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికాకృష్ణ సృష్టం చేశారు. ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం మొదటి ఏడాది రూ.30 కోట్లు కేటాయించింది. రెండో ఏడాది రూ.50 కోట్లు కేటాయించడంతోపాటు మరో రూ.50 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించింది. ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ఏమీ చేయలేదన్న ప్రతిపక్షం మాటలు నమ్మొద్దు అని వ్యాఖ్యానించారు.













